పెన్షన్ కానుక లబ్ధిదారులు కూడా వైఎస్సార్ చేయూత (Y.S.R Cheyutha) పధకానికి అర్హులే


వైఎస్సార్ చేయూత (Y.S.R Cheyutha):: SC, ST, BC & MINORITY పెన్షన్ కానుక  లబ్ధిదారులు  కూడా వైఎస్సార్ చేయూత (Y.S.R Cheyutha) పధకానికి అర్హులేఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు లో  వైఎస్సార్ చేయూత అనే కొత్త పథకం అమలు అవ్వబోతుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటికి సంబంధిచిన మార్గదర్శకాలు విడుదల చేసి గ్రామ వాలంటీర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు .
వైఎస్సార్ చేయూత (Y.S.R Cheyutha) Sakala  Updates

SC, ST, BC, Minority వర్గాలకు చెందిన 8.21 లక్షల మంది  మహిళలు వైఎస్సార్ పెన్షన్ కానుక  పధకం ద్వారా లబ్ది పొందుతున్నారు. అయితే ఇంతకుముందు ఇచ్చిన  మార్గదర్శకాల ప్రకారం వైఎస్సార్ పెన్షన్ పొందుతున్న మహిళలను అనర్హులుగా పేర్కొన్నారు . అయితే పెన్షన్ పొందుతున్న వారికి కూడా  వైఎస్సార్ చేయూత (Y.S.R Cheyutha) కింద ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం బుధవారం వైఎస్సార్ చేయూత (Y.S.R Cheyutha) కింద మరిన్ని లబ్ధిదారులను చేర్చాలని నిర్ణయించింది, దీనివలన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల SC, ST, BC & MINORITY మహిళల కు  ప్రతి ఒక్కరికి తదుపరి నాలుగు సంవత్సరాలు 75,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది .

అంతకుముందు వైఎస్సార్ పెన్షన్ కానుక కింద పెన్షన్లు పొందుతున్న మహిళలను పథకంలో చేర్చలేదు. "వితంతువులు, ఒంటరి మహిళలు, అంగవైకల్యం ఉన్నవారు  మరియు ఇతరులతో సహా 8.21 లక్షల మంది మహిళలు పెన్షన్లు పొందుతున్నారు. పథకం కింద ఇప్పటికే 17 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారువైఎస్సార్ పెన్షన్ పొందుతున్న మహిళలను కూడా వైఎస్సార్ చేయూత(Y.S.R Cheyutha) పథకంలో చేర్చటం ద్వారా ఇప్పుడు మొత్తం 25 లక్షల మంది లబ్ధిదారులు అవుతారు . లబ్ధిదారులకు నాలుగేళ్లకు సంవత్సరానికి రూ .18,750 లభిస్తుంది.

ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి.?
వైఎస్సార్ చేయూత (Y.S.R Cheyutha) పధకానికి రిజిస్ట్రేషన్ సమయం మరో 5 రోజులు పొడిగించబడింది, అంటే, జులై 21 వ తేదీ చివరిది. అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసి, మరియు మైనారిటీ మహిళలందరూ గ్రామ /వార్డు వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

వైఎస్సార్ చేయూత (Y.S.R Cheyuta) పథకానికి కావలసిన అర్హతలు , డాకుమెంట్స్ కోసం ఇది కూడా చదవండి. వైయస్ఆర్ చేయూత (YSR Cheyuta)