AP Degree,B.Tech,PG Last Semester Exams Cancelled.
ఏపీలో డిగ్రీబీటెక్, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం.
యూనివర్సిటీల వైస్ చాన్సెల్లర్ల (ఉపకులపతుల) సమావేశం లో నిర్ణయం.


అమరావతి: డిగ్రీ, పీజీ, బీటెక్, వృత్తి విద్య, అన్ని కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కష్టమని పలువురు వెల్లడించారు. ఉపకులపతుల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయా లను సీఎం జగన్కు వివరించి, అధికారికంగా నిర్ణయం వెల్లడించనున్నారు. డిగ్రీ మొదటి, రెండు, బీటెక్ మూడేళ్లు, పీజీ మొదటి ఏడాది విద్యార్థులకు ప్రస్తుతం ఎలాంటి పరీక్షలు నిర్వ హించకుండా పై తరగతులకు పంపిస్తారు. కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత వీరికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్షల నిర్వహణ, అకడమిక్ క్యాలెండర్ పై వర్సిటీల వీసీలతో మంగళవారం మంత్రి ఆది మూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, కళాశాల విద్య ప్రత్యేక కమి షనర్ నాయక్, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి వీడియో కాన్ఫ రెన్సు నిర్వహించారు. పరీక్షలను రద్దు చేస్తే కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన సెమిస్టర్, మిడ్, ఇతర అంతర్గత మార్కులు, సబ్జెక్టుల వారీగా మౌఖిక పరీక్షలు(వైవా), ఏదైనా చిన్న పరీక్ష నిర్వహించడం ఆధారంగా చివరి సెమిస్టర్ విద్యార్థులకు మార్కులు కేటాయించాలని నిర్ణయించారు.
·         చివరి సెమిస్టర్ విద్యార్థులకు గత సంవత్సరాల్లో ఫెయిల్ అయిన సబ్జె క్టులు ఉంటే వాటికి అంతర్గత మార్కులు, మౌఖిక పరీక్షల ఆధారంగా క్రెడిట్లు కేటాయిస్తారు.
·         అకడమిక్ సంవత్సరం ఆగస్టులో ప్రారంభం కానుంది. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు.
·         వర్సిటీలు కొన్ని సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించాయి. మిగతా సబ్జెక్టు లకు పరీక్షలు నిర్వహించకుండా అంతర్గత మూల్యాంకనం ద్వారా క్రెడిట్లు కేటాయిస్తారు.


Source :Eenadu.net


అలాగే సాక్షి పేపర్ లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ కూడా కింద పొదుపరచటమైనది . 


అయితే ఇప్పటికే చాలా ఎగ్జామ్స్ కి సంభందించి విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులు చెల్లించారు . అయితే వాటిని తిరిగి వెనక్కిచ్చేస్తారా లేదా అనే విషయం గురించి మాత్రం స్పష్టత లేదు. 
x