ఆందోళనలో ఇంజినీరింగ్, డిగ్రీ, ఎంబీఏ, అగ్రికల్చర్ బీఎస్సీ,  పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు.
పరీక్షలు వద్దు, ప్రస్తుత పరిస్థితిలో నిర్వహించలేం, సర్కార్‌కు పవన్ కల్యాణ్ సూచన.

ఇప్పటికే పదవ తరగతి పరీక్షలపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు పదో తరగతి పరీక్షలను రద్దు చేశారుఅలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులను  కూడా పాస్ చేస్తున్నట్లు తెలియజేశారు. అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులందరూ కరోనా తీవ్రత వలన  పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారుఅలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పాస్ అయ్యారు .
డిగ్రీ, ఎంబీఏ, అగ్రికల్చర్ బీఎస్సీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ ఇలా చాలా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు ఉంటాయా లేదా అని చాలా ఆందోళనతో ఉన్నారు. అయితే ఇటీవలే దీనిపై పవన్ కళ్యాన్ స్పందిస్తూ విధంగా అన్నారు.

కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో విద్యార్థుల అన్నీ పరీక్షలు రద్దు చేయాలని జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుత పరిస్థితిలో పరీక్షలు నిర్వహించే అవకాశం లేదని గుర్తుచేస్తూ పదో తరగతి పరీక్షల మాదిరిగానే మిగతా ఎగ్జామ్స్ కూడా పాస్ చేయాలని సూచించింది.

 జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు . ఇంకా ఇంకా ప్రెస్ మీట్ లో ఏముందంటే

పదో తరగతి డి పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించిన విధంగానే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారి విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలి

డిగ్రీ తో పాటు ఎంబీఏ, అగ్రికల్చర్ బీఎస్సీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐఇలాంటి విద్యలు అభ్యసించి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షల నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదువిద్యార్థులు తమ కాలేజీ లు ఉన్న పట్టణాలు నగరాలకు వెళ్ళటం, హాస్టల్స్ లో ఉండి పరీక్ష కేంద్రాలకు వెళ్లి రావటం వారి ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు.

మరోవైపు పై చదువులకు వెళ్లేందుకు , అలాగే క్యాంపస్ సెలక్షన్స్ లో జరిగిన ఉద్యోగాలకు ఎంపిక సర్టిఫికెట్స్ ఇచ్చేందుకు సమయం దగ్గర పడుతుందని  …. పరీక్షలు లేని కారణంతో పట్టాలు(డిగ్రీ ) చేతికి రాక అర్హత కోల్పోతామనే  ఆందోళన  పెరుగుతుందని విద్యార్థులు తమ పార్టీ దృష్టికి తీసుకు వచ్చారని అన్నారు.
లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు రద్దు చేసి, ఉత్తీర్ణతను ప్రకటించాలిఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు పరిగణలోకి తీసుకోవాలి . విద్యార్థుల ఆరోగ్యం, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీ తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.”

అయితే త్వరలోనే ప్రభుత్వం దీని మీద స్పందించి ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.