జగనన్న తోడు (JAGANANNA THODU)

జగనన్న తోడు(Jaganna Thodu) చిరు వ్యాపారులు మరియు సాంప్రదాయ వృత్తిదారులకు పది వేల రూపాయల వరకు వడ్డీ లేని ఋణాలు.


More Updates


గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు అనేకమంది వృత్తిదారులు చిరు వ్యాపారులు ఉద్యోగులు కార్మికులను కలిసి వారు పడుతున్న ఇబ్బందులను చూసి బాధలను విని నవరత్నాల పథకాలు ద్వారా అన్ని వర్గాల సంక్షేమ మరియు అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
    చిరు వ్యాపారులు మరియు సంప్రదాయ చేతివృత్తిదారులు (Traditional Handicrafts Artisans) ఇప్పటివరకూ స్థానికంగా ఉన్న వడ్డీ వ్యాపారస్తుల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకుని వారి వ్యాపారాలను నిర్వహిస్తూ ఆర్థికంగా ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు.
నవరత్నాల అమలులో భాగంగా "జగనన్న తోడు" (Jagananna Thodu) అనే పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది చిరు వ్యాపారులకు మరియు సాంప్రదాయ చేతి వృత్తి దారులు,  వారి వ్యాపారాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఒక్కొక్కరికి పది వేల రూపాయల వరకు పెట్టుబడి మూలధనంగా బ్యాంకుల నుండి వడ్డీలేని రుణం (Sunna Vaddi) ఇప్పించేందుకు శ్రీకారం చుట్టారు.
జగనన్న తోడు (Jagananna Thodu) పధకం వివరాలు.

చిరువ్యాపారులు అంటే ఎవరు ?

Ø సాంప్రదాయబద్ధమైన చేతి వృత్తులను జీవనాధారంగా చేసుకొని జీవించేవారు అనగా ఉదాహరణకు మగ్గం పని, లేస్ వర్క్, కుమ్మరి, కలంకారి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, తోలు బొమ్మలు, బొబ్బిలి వీణ వస్తువుల తయారీ మొదలైనవి ఉత్పత్తి చేస్తూ స్వయంగా అమ్ముకునేవారు.
Ø రోడ్డు పక్కన, వీధుల్లో, బహిరంగ ప్రదేశాలలో, ఫుట్ పాత్ లలో మరియు ప్రైవేట్ స్థలాలలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం చేసుకునేవారు.
Ø సుమారు 5X5  అడుగుల స్థలంలో పర్మినెంట్ లేదా టెంపరరీ షాపులను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకునేవారు.
Ø తోపుడు బండ్లు లేదా తల మీద/ భుజం మీద  బుట్టలు/ గంపల లో వస్తువులు/ సరుకులను మోస్తూ అమ్ముకునేవారు, మరియు వీధులలో సరుకులు/ వస్తువులు అమ్ముకునే వారు.
Ø ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సైకిల్ మోటార్ వెహికల్ మరియు చక్రాల బండి మీద వెళ్తూ సరుకులు/ వస్తువులు అమ్ముకునే వారు.
Ø 5X5 అడుగుల స్థలంలో కిరాణా షాపుల ద్వారా వస్తువులు /సరుకులు అమ్ముకునేవారు.

జగనన్న తోడు (Jagananna Thodu) పథకానికి అర్హులు ఎవరు?

ü 18 సంవత్సరాలు నిండిన వారు.
ü నెలవారి ఆదాయం గ్రామాలలో Rs.10,000/- మరియు పట్టణాలలో Rs.12,000/- కలిగినవారు.
ü మాగాణి భూములు 3 ఎకరాలు లేదా మెట్ట భూములు 10 ఎకరాలు లేదా మెట్ట మరియు మాగాణి భూములు కలిపి 10 ఎకరాలు ఉన్న వారు.
ü ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను( ఆధార్ కార్డ్,  ఓటర్ కార్డు,  లేదా ఇతరములు)  కలిగినవారు.
ü సుమారు 5X5 అడుగుల స్థలం  ఉన్న మరియు అంతకు తక్కువ ఉన్న షాప్ లో వ్యాపారం చేసుకుంటున్న వారు.


పైన తెలియచేసిన వారందరూ జగనన్న తోడు (Jagananna Thodu) పథకానికి అర్హులు.

కార్యచరణ మార్గదర్శకాలు:
 సర్వే మరియు ఎంపిక విధానం:

ü గ్రామ మరియు వార్డు వాలంటీర్లు వారి పరిధిలో ఉన్న చిరు వ్యాపారులను సర్వే ద్వారా గుర్తిస్తారు.
ü సామాజిక తనిఖీ కొరకు గుర్తించినా జాబితాను గ్రామ వార్డు సచివాలయం ప్రదర్శిస్తారు. సామాజిక తనిఖీ పూర్తయిన తర్వాత తుది జాబితాను రూపొందిస్తారు.
ü నిరంతర సామాజిక తనిఖీ కొరకు మరియు పారదర్శకత కొరకు తుది జాబితాను సచివాలయంలో ప్రదర్శిస్తారు.
ü అర్హులు ఎవరైనా తన పేరు తొలి జాబితాలో నమోదు కాలేదు అంటే అట్టి వారు గ్రామ వార్డు సచివాలయం లో పేరు నమోదు చేసుకోవలెను. 
ü జగనన్నతోడు పథక అమలును నిరంతరం పర్యవేక్షణ చుటకు పారదర్శకమైన ఆన్లైన్ పోర్టల్ను బ్యాంకు సమన్వయంతో నిర్వహించబడుతుంది.
ü తుది జాబితా ద్వారా ఎంపిక చేసిన చిరువ్యాపారులు అందరికీ గ్రామ/వార్డు వాలంటీర్ ద్వారా క్యూఆర్ కోడ్ ( QR Code ) కలిగిన స్మార్ట్ గుర్తింపుకార్డులను అందిస్తారు. 
ü బ్యాంకు ఎకౌంటు లేని వారు వ్యక్తిగత పొదుపు అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ను ప్రారంభించాలి. 
జగనన్న తోడు (Jagananna Thodu) పధకం ద్వారా జీరో ఇంటరెస్ట్ లోన్ లేదా సున్నా వడ్డీ లోన్ ఎలా పొందాలో ఈ  క్రింద తెలిచేయటమైంది.

జగనన్న తోడు (Jagananna Thodu) పథకం ద్వారా వడ్డీ లేని ఆర్థిక సహాయం పొందు విధానం:

v జగనన్న తోడు (Jagananna Thodu) పథకం దరఖాస్తులను గ్రామ/వార్డు వాలంటీర్ ద్వారా గ్రామ సచివాలయ లో స్వీకరిస్తారు.
v జగనన్న తోడు (Jagananna Thodu) దరఖాస్తులు పూర్తి చేయుటలో మరియు అవసరమైన Proofs (డాక్యుమెంట్స్) జతపరుచుటలో గ్రామ/వార్డు వాలంటీర్లు చిరు వ్యాపారులకు సహకరిస్తారు.
v గ్రామ/వార్డు సచివాలయం వద్ద సామాజిక తనిఖీ చేసిన జగనన్న తోడు (Jagananna Thodu) జాబితాను జిల్లా కలెక్టర్ వారు పరిశీలించి మరియు ఆమోదించిన జాబితాను బ్యాంకులను బ్యాంకులకు పంపబడును.
v బ్యాంకు సిబ్బంది జగనన్న తోడు (Jagananna Thodu) దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మార్గదర్శకాల ప్రకారం పథకానికి అర్హులైన దరఖాస్తుదారుల అభ్యర్థన మేరకు పది వేల రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేస్తారు.
v జగనన్న తోడు (Jagananna Thodu) పధకం ద్వారా మంజూరు చేసిన రుణము లబ్ధిదారుల పర్సనల్ బ్యాంక్ అకౌంట్ కు ప్రత్యక్షంగా బదిలీ చేస్తారు.
v రుణం పంపిణీ చేసిన జాబితా మరియు తిరిగి చెల్లింపు లావాదేవీలను రోజు వారి విధానంలో బ్యాంకు వారు గ్రామ/వార్డు సచివాలయలకు మరియు సంబంధిత వాలంటీర్ కు సమాచారం మరియు పర్యవేక్షణ నిమిత్తం పంపబడుతుంది.
v చిరువ్యాపారులు నెలవారి రుణం యొక్క అసలు మరియు వడ్డీ చెల్లింపులు బ్యాంకులకు సక్రమంగా చెల్లించేలా గ్రామ/వార్డు వాలంటీర్లు పర్యవేక్షిణించవలెను  మరియు బ్యాంకు కలెక్షన్ ఏజెంట్ లకు సహకరించవలెను.
v బ్యాంకు వడ్డీ చెల్లింపు విధానాన్ని బ్యాంకుల అనుసంధానంతో గ్రామ/వార్డు సచివాలయ శాఖ నిర్ధారిస్తుంది.

పథక అమలు సంస్థ:

గ్రామ/వార్డు వాలంటీర్లు మరియు గ్రామ/వార్డు సచివాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

జగనన్న తోడు (Jagananna Thodu) పథకానికి అర్హులైన అందరూ వాలంటీర్లు లేదా సచివాలయాను సంప్రదించి లబ్దిపొందగలరు.